Anil Ravipudi: వరుస విజయాలతో టాలీవుడ్‌లో హిట్ మెషీన్‌గా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన చేసిన 9 సినిమాలతో హిట్లు కొట్టి.. అభిమానుల మనసులు కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు తన 10వ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నారు. తన 10వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
READ ALSO: T20 World Cup 2026: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య “అన్నదమ్ముల ప్రేమ”.. ఇది రాజకీయ వ్యూహమేనా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. తన 10వ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే తన 10వ సినిమాకి సంబంధించిన ఐడియాను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు, అది చాలా విచిత్రమైన టైటిల్ అని వెల్లడించారు. ప్రస్తుతానికి అయితే దానిని రివీల్ చేయడం లేదని, ఎప్పుడైతే టైటిల్ అనౌన్స్ మెంట్ వస్తుందో అప్పటి నుంచే .. ‘వీడు మళ్లీ మొదలెట్టాడురా బాబు’ అని అందరూ తిట్టుకోవడం పక్కా అని అభిప్రాయపడ్డారు. ఇంకా తన 10వ సినిమాకు సంబంధించి హీరో ఎవరు అనేది ఫిక్స్ కాలేదని చెప్పారు. అయితే ఈ సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందకు వస్తుందని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సినిమాలో హీరోగా పలువురు పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న పేర్లలో ముందు వరుసలో అక్కినేని నాగార్జున, తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రవితేజ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి టాలీవుడ్ సీనియర్ హీరోలు వెంకటేష్, బాలయ్య, చిరంజీవిలతో సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఆయన తన తర్వాత సినిమాను కింగ్ నాగార్జునతో చేసి ఈ నలుగురు హీరోలతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటాడనే టాక్ ఉంది. చూడాలి మరి 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి ఏ హీరోతో తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు అనేది. ఏది ఏమైనా 2027 సంక్రాంతికి కూడా తన మార్క్ ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’తో థియేటర్స్‌లోకి రావడం మాత్రం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: How Bombay Became Mumbai: ముంబైకి బాంబే అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?
