Palash Muchhal: మరాఠీ నటుడు – నిర్మాత విజ్ఞాన్ మానేపై ప్రముఖ బాలీవుడ్ సంగీతకారుడు, చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగిన ముంబైలోని అంధేరి కోర్టుకు పలాష్ తన న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారేతో కలిసి వచ్చారు. పలాష్ పై విజ్ఞాన్ మానే తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. సినిమా పెట్టుబడి పేరుతో పలాష్ తనకు రూ.40 లక్షలు మోసం చేశాడని మానే ఆరోపించారు. అలాగే క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ సంబంధం గురించి కూడా ఆయన పలు ఆరోపణలు చేశారు.
READ ALSO: YIL Recruitment 2026: యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,979 ఉద్యోగాలు.. ట్రైనింగ్, స్టైఫండ్ కూడా..
స్మృతి తండ్రి ద్వారా తనకు పలాష్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తన దగ్గరి నుంచి సినిమా పెట్టుబడి పేరుతో రూ.40 లక్షలు తీసుకున్నాడని, కానీ తిరిగి ఇవ్వలేదని మానే చెప్పారు. స్మృతి – పలాష్ పెళ్లి రోజున పలాష్ మరొక మహిళతో పట్టుబడ్డాడని, అందుకనే స్మృతితో తన వివాహం ఆగిపోయిందని కూడా మానే పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మహారాష్ట్రలోని సాంగ్లిలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, దురుద్దేశంతో కూడుకున్నవని పలాష్ పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా విజ్ఞాన్ మానేకు రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపానని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పలాష్ మాట్లాడుతూ.. తన ఇమేజ్, కెరీర్‌కు హాని కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఇదే టైంలో విజ్ఞాన్ కూడా తనకు నోటీసు అందినట్లు ధృవీకరించారు. పలాష్ – స్మృతి మంధానల వివాహం రద్దు అయిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. స్మృతి మంధాన – పలాష్ ల వివాహం రద్దు అయిన సంగతి తెలిసిందే. నిజానికి వాళ్లిద్దరూ చాలా కాలం ప్రేమలో ఉన్నారు. పెద్దల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పలు కారణాలతో వారి పెళ్లి రద్దు అయ్యింది.
READ ALSO: Vishwak Sen: ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి: విశ్వక్‌సేన్