Prabhas: జపాన్‌లో ‘డార్లింగ్’ ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ప్రఖ్యాత జపాన్ మ్యాగజైన్ అనన్ బ్యాక్ కవర్‌పై కనిపించనున్న తొలి ఇండియన్ సోలో హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో ‘RRR’ సినిమా సందర్భంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా.. ఇప్పుడు ప్రభాస్ ఒక్కడే సోలోగా తన చరిష్మాతో మ్యాగజైన్‌ను అలంకరించడానికి రెడీ అవుతున్నారు.
READ ALSO: Heart Disease: మహిళల కంటే 7 ఏళ్లే ముందే పురుషులకు గుండె జబ్బులు.. కారణాలు ఇవే..!
ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ మ్యాగజైన్ కవర్ పేజీ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ నుంచి ప్రభాస్‌కు జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ‘కల్కి 2898 AD’ కూడా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. గతంలో జపాన్ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రభాస్ గత డిసెంబర్‌లో టోక్యో పర్యటించారు. ఆ పర్యటనలోనే ఈ స్పెషల్ కవర్ ఫోటో షూట్ జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ‘కల్కి 2’ షూటింగ్‌లో కూడా ప్రభాస్ పాల్గొననున్నారు.
READ ALSO: T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
