Site icon NTV Telugu

FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!

Funky Trailer

Funky Trailer

FUNKY Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కె.వి. కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘FUNKY’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతుంది. డైరెక్టర్ అనుదీప్ తన గత చిత్రాలైన ‘జాతి రత్నాలు’, ‘ప్రిన్స్’ తరహాలోనే వింతైన లాజిక్స్‌తో, పొట్ట చెక్కలయ్యే డైలాగులతో ట్రైలర్‌ను నింపేశారు.

READ ALSO: CM Revanth Reddy : ఎనిమిదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే.. వికారాబాద్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం

“మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి అంటే.. నాకు రాదు డాక్టర్”, మొదలైన డైలాగ్స్ హిలేరియస్‌గా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈక్రమంలో రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచినట్లు అయ్యింది. ఈ చిత్రంలో విశ్వక్‌సేన్.. కోమల్ అనే డైరెక్టర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా కయాదు లోహర్‌ కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ ALSO: Varanasi Update: రాజమౌళి మరో మాస్టర్ ప్లాన్.. వారణాసి మొత్తం ఐమ్యాక్స్ కాదట!

Exit mobile version