Site icon NTV Telugu

England vs Australia: ఛీ.. ఛీ.. ఆస్ట్రేలియా జట్టు బుద్ది మారదా.? మరోసారి వక్రబుద్ధి బయటపడిందిగా.!

England Vs Australia (1)

England Vs Australia (1)

England vs Australia: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ క్యాచ్ పట్టాడు. కాకపోతే అది పూర్తి క్యాచ్ కాకపోవడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే, కొద్ది చర్చ తర్వాత ఇద్దరు అంపైర్లు క్యాచ్‌ను మళ్లీ తనిఖీ చేయమని థర్డ్ అంపైర్‌ను కోరారు. అందులో బంతి కీపర్ గ్లోవ్స్ ముందు భూమిని తాకినట్లుగా స్పష్టంగా కనిపించింది.

Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్‌కు ఘోర ప్రమాదం..

17వ ఓవర్‌లో, మిచెల్ స్టార్క్ వేసిన ఐదో బంతికి లెగ్ సైడ్ వెలుపల కీపర్ జోష్ బంతిని పట్టదు. బంతి బ్యాట్ అంచుని తీసుకొని వెనక్కి వెళ్లింది. అక్కడ క్యాచ్ ను ఎడమవైపు డైవింగ్ చేస్తూ పట్టుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు కీపర్ జోష్. ఆస్ట్రేలియా ఆటగాళ్లను చూసిన అంపైర్ జోయెల్ విల్సన్ కూడా క్యాచ్ కరెక్ట్ గా తీసుకున్నాడని భావించి ఔట్ ఇచ్చాడు ఫీల్డ్ అంపైర్. అయితే ఆ తర్వాత అంపైర్లు మాట్లాడిన తర్వాత, అంపైర్లు ఇద్దరూ క్యాచ్‌ను మళ్లీ తనిఖీ చేయమని థర్డ్ అంపైర్‌ను కోరారు.

India vs Bangladesh: రెండోరోజు ఆట వర్షర్పణం కానుందా.? కమ్ముకున్న చీకటి మేఘాలు!

గ్లోవ్స్‌కు చేరుకోకముందే బంతి నేలపై పడిందని రీప్లేలో స్పష్టంగా కనపడింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. పెద్ద స్క్రీన్‌పైకి రీప్లేలు రావడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కేకలు వేయడం ప్రారంభించారు. క్రీడాస్ఫూర్తిని ప్రజలు ప్రశ్నించడంతో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ జోష్ సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇంతకుముందు లార్డ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మరో వికెట్ కీపర్ అలెక్స్ కారీ కూడా యాషెస్ 2023 రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టోను స్టంప్ చేయడం ద్వారా వివాదంకు దారి తీసాడు.

Exit mobile version