NTV Telugu Site icon

England Under-19 Cricket Team: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్!

England Under 19 Cricket Team

England Under 19 Cricket Team

England Under-19 Cricket Team visited Vijayawada Kanaka Durga Temple: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంగ్లీష్ ఆటగాళ్లకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రంను పాలకమండలి సభ్యులు అందజేశారు.

Also Read: Telangana Elections 2023: కేసీఆర్‌కు బిగ్ షాక్.. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే!

భారతదేశంలో వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్లో భారత్ నుంచి రెండు టీమ్స్ ఆడుతుండగా.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు బరిలో ఉన్నాయి. నవంబర్ 13న ఆరంభం అయిన ఈ సిరీస్.. నవంబర్ 27తో ముగుస్తుంది. ఈ సిరీస్లో భారత్ A జట్టు వరుస విజయాలు సాగిస్తుండగా.. B టీమ్ ఓటములను ఎదుర్కొంటోంది. ఇక విజయవాడ మూలపాడులోని దేవినేని వెంకట రమణ ప్రణీత మైదానంలో ఈ మ్యాచులు జరుగుతున్నాయి.

England Under 19 Cricket Team1

 

Show comments