Site icon NTV Telugu

SA vs ENG: సౌతాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యం.. ఇంగ్లాండ్‌ జట్టుకు ఏమైంది..?

Sa

Sa

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు వెళ్లారు.ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో అత్యధికంగా జో రూట్ 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 25, బెన్ డకెట్ 24, జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు. మొదట్లోనే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సాల్ట్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మొదటి వికెట్ కోల్పోయాడు.

Read Also: Amitabh Bachchan:1990ల్లోనే అమితాబ్ బచ్చన్‌పై 55 కేసులు, 90 కోట్ల అప్పులు.. ఎలా అధిగమించారు?

మరోవైపు.. సౌతాఫ్రికా అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను మడతపెట్టేశారు. మార్కో జన్‌సన్, వియాన్ మల్డర్ చెరో 3 వికెట్లు తీశారు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడి, కగిసో రబాడా తలో వికెట్ సంపాదించారు. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా జట్టు రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా అనారోగ్యం కారణం వల్ల ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతనితో పాటు టోనీ డిజోర్జీ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. వారి స్థానంలో హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ జట్టులో మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమూద్ వచ్చాడు. కాగా.. సౌతాఫ్రికా ముందు 180 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే…

Read Also: Kishan Reddy: బీజేపీని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పోదు..

Exit mobile version