England playing XI vs India for the 5th Test: ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్‌కు ఓ రోజు ముందుగానే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తోంది. ఈ క్రమంలో భారత్‌తో ఐదో టెస్టుకు ఒక రోజు ముందుగానే ఈసీబీ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. లండన్‌లోని కెన్నింగ్ టన్ ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌కు ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత్‌తో ఐదవ టెస్టు కోసం తుది జట్టులో ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ నాలుగు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్ సహా ఆల్‌రౌండర్ లియామ్ డాసన్, పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్‌ను తుది జట్టు నుంచి ఈసీబీ తప్పించింది. వీరి స్థానాల్లో జాకబ్ బెథెల్, జేమీ ఒవర్టన్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్‌లను జట్టులోకి తీసుకున్నారు. స్టోక్స్, ఆర్చర్ జట్టుకు దూరమవ్వడం ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బే అని చెప్పాలి.
Also Read: Perni Nani: కొడుకు కోసమే చంద్రబాబు తపన.. జగన్ అడ్డంకి లేకుండా చేస్తున్నారు!
జాకబ్ బెథెల్ బ్యాటింగ్ లైనప్‌లో ఆరో స్థానంలో ఆడనున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను జేమీ స్మిత్ నిర్వహిస్తాడు. జాక్ క్రాలే, బెన్ డకెట్ ఓపెనర్లుగా కొనసాగుతారు. ఓలీ పోప్ మూడవ స్థానంలో, జో రూట్ నాలుగో స్థానంలో ఆడతారు. హ్యారీ బ్రూక్ ఐదవ స్థానంలో బరిలోకి దిగుతాడు. క్రిస్ వోక్స్ ఆల్‌రౌండర్‌గా ఏడో స్థానంలో ఆడతాడు. గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ పేస్ కోటాలో ఆడనున్నారు. ప్రస్తుతం 2-1తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే సిరీస్ 2-2తో సమం అవుతుంది. మ్యాచ్ డ్రా అయినా కూడా సిరీస్ ఇంగ్లండ్ సొంతమవుతుంది.
ఇంగ్లండ్ ప్లేయింగ్ 11:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్ మరియు జోష్ టంగ్.
