NTV Telugu Site icon

Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో చోరీ.. విలువైన వస్తువులతో పాటు అవార్డు మాయం

Ben Stokes

Ben Stokes

Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు ముసుగు ధరించిన దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. అయితే, పాకిస్థాన్ ప‌ర్యట‌న‌లో ఉన్నారు బెన్ స్టోక్స్‌.. అస‌లే సిరీస్ ఓట‌మి బాధ‌లో ఉన్న అతడికి మరో దెబ్బ తగిలింది.. ఇంట్లో దొంగ‌లు పడి ఎన్నో విలువైన వ‌స్తువులు ఎత్తుకెళ్లారు.. స్టోక్స్‌ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.. అయితే, తన కుటుంబానికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని, అయితే వారి విలువైన వస్తువులు.. సెంటిమెంట్‌తో కూడకున్న వస్తువులు కూడా దొంగిలించబడ్డాయని పేర్కొన్నారు..

Read Also: Rashi khanna : గేమ్ ప్లాన్ మార్చిన రాశీ ఖన్నా.. అమ్మడి రూటే సపరేటు

బెన్ స్టోక్స్ తనకు లభించిన.. 2020 OBE అవార్డు, మూడు గొలుసులు, ఒక ఉంగరం మరియు డిజైనర్ బ్యాగ్‌తో సహా దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.. ‘అక్టోబర్ 17 గురువారం సాయంత్రం కాజిల్ ఈడెన్ ప్రాంతంలోని నా ఇంటిలోకి పలువురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరపడ్డారు.. ఆ సమయంలో నా భార్య కార్లే, పిల్లలు లేట‌న్, లిబ్బిలు ఇంట్లోనే ఉన్నారు. అయితే.. వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా దొంగలు.. విలువైన న‌గ‌లు, ఖ‌రీదైన ఆభ‌ర‌ణాలు.. నాకు బ్రిటన్ ప్రభుత్వం బ‌హూక‌రించిన ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డును ఎత్తుకెళ్లిపోయారని.. అదంటే నాకు చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చాడు.. వారు నగలు, ఇతర విలువైన వస్తువులు మరియు చాలా వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లిపోయారు.. వాటిలో చాలా అంశాలు నాకు మరియు నా కుటుంబానికి నిజంగా సెంటిమెంట్.. విలువను కలిగి ఉన్నాయి.. అవి భర్తీ చేయలేనివి అంటూ భాగోద్వేగాని గురయ్యాడు.. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించగలం. ‘నేను దొంగిలించబడిన కొన్ని వస్తువుల ఛాయాచిత్రాలను విడుదల చేస్తున్నాను – వాటిని సులభంగా గుర్తించగలమని నేను ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌.