NTV Telugu Site icon

USA vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌ బౌలర్.. 5 బంతుల్లో 4 వికెట్లు..

New Project (18)

New Project (18)

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికా క్రికెట్ జట్టు నేడు 49వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ చరిత్ర సృష్టించాడు.

READ MORE: Pawan Kalyan: రేపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరుపున 19వ ఓవర్ వేయడానికి వచ్చిన క్రిస్ జోర్డాన్ 5 బంతుల్లోనే 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో, అతను అంతర్జాతీయ T20 లో తన మొదటి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఇంగ్లిష్‌ బౌలర్‌గా క్రిస్‌ జోర్డాన్‌ నిలిచాడు.

మరోవైపు సూపర్-8లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అమెరికా సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. మరోవైపు ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో 1 గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం జట్టుకు చాలా ముఖ్యం.