లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..

India

India

WTC 2025-27 Rankings: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ న్యూజిల్యాండ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు పట్టా పగలే చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్ గుస్ అట్కిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగగా.. ఆలీ రాబిన్సన్ మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రాబిన్సన్, రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు.

ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడు టెస్టుల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో 77.78 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కివీస్, ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వారి పాయింట్ల శాతం 58.33కి తగ్గిపోయింది. దీంతో ప్రస్తుత WTC ఛాంపియన్ సౌతాఫ్రికా, అలాగే శ్రీలంక న్యూజిలాండ్‌ను అధిగమించి ముందంజలో నిలిచాయి. మరోవైపు ఇంగ్లండ్ ఈ విజయంతో ఏడో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ.. తన పాయింట్ల శాతాన్ని 37.88కి మెరుగుపరుచుకుంది. ఈ సైకిల్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగు విజయాలు, ఆరు ఓటములు, ఒక డ్రాతో కొనసాగుతోంది. ప్రస్తుతం 48.15 పాయింట్ల శాతంతో ఉన్న టీమిండియా ఇంగ్లండ్ మరింత చేరువైంది. WTC ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ ఆరవ స్థానంలో కొనసాగుతుంది. లార్డ్స్‌లో సాధించిన ఈ విజయం ఇంగ్లండ్‌కు సిరీస్‌లో శుభారంభాన్ని అందించగా, న్యూజిలాండ్ మాత్రం WTC రేసులో ఎదరు ఈదాల్సిన పరిస్థితి ఏర్పడింది.

×
×
Ad