IND vs ENG: భారత్‌తో జూన్ 20 నుంచి లీడ్స్ లోని హెడ్డింగ్లీలో మొదలు కానున్న టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు 14 మందితో కూడిన తమ తొలి జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ టీంలో క్రిస్ వోక్స్, జేమీ ఓవర్టన్ లకు తిరిగి చోటు దక్కగా, యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తన స్థానం నిలబెట్టుకున్నాడు. నిజానికి 36 ఏళ్ల వోక్స్ గత సంవత్సరం అషెస్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడలేదు. కానీ, ఇంగ్లాండ్ కండిషన్లలో అతడి అనుభవం బాగా పనికివస్తుందని భావించి తిరిగి ఎంపిక చేశారు. 2018లో లార్డ్స్ టెస్ట్‌లో వోక్స్ భారతపై 4 వికెట్లు తీసి, 137 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ విజయానికి కీలకంగా నిలిచారు.
Read Also: Joan Alexander: 88 ఏళ్ల వయస్సులో డిగ్రీ పూర్తి చేసిన బామ్మ..!
మరో సీనియర్ ఆటగాడు జేమీ ఓవర్టన్ ఇటీవలే వేలి గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఓవర్టన్ ను ఇంగ్లాండ్ బోర్డు వైద్య బృందం ప్రతిరోజు పర్యవేక్షిస్తోంది. గస్ అట్‌కిన్సన్ మాత్రం హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేరు. అలాగే గత జింబాబ్వేతో టెస్ట్ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన షోయబ్ బషీర్ లోన్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. యువ ఆటగాడు జాకబ్ బెతెల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా పేసర్ సామ్ కుక్ తన ప్రదర్శనతో సెలెక్టర్లను మెప్పించి స్థానం నిలుపుకున్నాడు.
ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ లీడ్స్‌లో, అనంతరం బర్మింగ్‌హామ్, లార్డ్స్ (లండన్), మాంచెస్టర్, ది ఓవల్ వేదికలుగా ఉంటాయి. భారత్ జట్టు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలో మైదానంలోకి అడుగుపెడుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లు రిటైర్మెంట్ ప్రకటించడంతో యంగ్ భారత జట్టు తొలిసారిగా అడుగుపెడుతోంది. ఫిట్‌నెస్ లోపం కారణంగా షమీ ఎంపిక కాలేదు.
A simply HUGE series awaits 🙌
Our squad for the 1st Test is HERE 👇
🏴 #ENGvIND 🇮🇳
— England Cricket (@englandcricket) June 5, 2025
ఇంగ్లాండ్ జట్టు (భారత్‌తో తొలి టెస్ట్‌కు):
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
