NTV Telugu Site icon

Joe Root: ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్!

Joe Root

Joe Root

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ రూట్ హాఫ్ సెంచరీ (62 నాటౌట్; 128 బంతుల్లో, 2 ఫోర్లు) చేసి.. ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు.

Also Read: Nani-Janhvi Kapoor: జాన్వీ కపూర్‌తో సినిమా.. హీరో నాని ఏమన్నారంటే?

టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (68) అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ (66) రెండో స్థానంలో ఉండగా.. రూట్ (64) మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్ బోర్డర్ (63), రాహుల్ ద్రవిడ్ (63), రికీ పాంటింగ్ (62) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాంచెస్టర్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక అర్ధ శతకాలు (8) చేసిన ప్లేయర్‌గా కూడా రూట్ మరో రికార్డు నెలకొల్పాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక 50+ స్కోరు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాలో రూట్ (10) నాలుగో స్థానంలో నిలిచాడు.

Show comments