ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
- పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్
- తొలి విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్
- శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 55 పరుగుల తేడాతో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs SL: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెన్ డకెట్ అద్భుత శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో లియామ్ డాసన్ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. 132 బంతుల్లో ఏకంగా 24 ఫోర్లతో 167 పరుగులు చేశాడు.
డకెట్‌కు టామ్ బాంటన్ నుంచి మంచి సహకారం లభించింది. బాంటన్ 75 బంతుల్లో 74 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 34 బంతుల్లో 44, జోర్డాన్ కాక్స్ 27 బంతుల్లో 43, విల్ జాక్స్ 21 బంతుల్లో 30, సామ్ కరన్ 12 బంతుల్లో 21 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశాడు. ఇక 387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్లో కమిందు మెండిస్ వికెట్ కోల్పోయింది. అయితే అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Also Read
- Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
- India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
- Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
- School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
ఇందులో అవిష్క 48 పరుగులు చేయగా.. కుశాల్ మెండిస్ 89 పరుగులతో రాణించాడు. ఆపై పావన్ రత్నాయకే అద్భుత పోరాటం చేశాడు. 77 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 118 పరుగులు చేసి శతకం సాధించాడు. అయితే మరో ఎండ్‌లో తగిన సహకారం లేకపోవడంతో శ్రీలంక 45.1 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 4 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. దీంతో ఇంగ్లండ్ 55 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధించగా.. శనివారం పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడనుంది.
ఈ ట్రై సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఇది నాలుగు మ్యాచ్‌ల్లో తొలి విజయం. అంతకుముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో 87 పరుగులతో ఓడింది. ఆ తర్వాత శ్రీలంక వన్డే చరిత్రలోనే అద్భుతమైన రన్ ఛేజ్‌తో ఇంగ్లండ్‌ను ఓడించింది. హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీతో ఇంగ్లండ్ 429 పరుగులు చేసినా.. శ్రీలంక 430 పరుగులు చేసి విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో శాదాబ్ ఖాన్ సంచలన శతకంతో పాకిస్థాన్‌ను ఒక్క వికెట్ తేడాతో గెలిపించాడు. చివరకు శ్రీలంకపై 55 పరుగుల విజయంతో ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో బోణీ కొట్టింది.
తాజావార్తలు
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!