ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజులో రెండో సెషన్ ముగిసింది. మొదటి సెషన్‌లో భారత్ ఆధిపత్యం సాధించగా.. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. 24 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 70 రన్స్ చేసింది. జో రూట్ (54) హాఫ్ సెంచరీ చేయగా.. ఓలీ పోప్ (44) అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. రెండో సెషన్‌లో ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు. రూట్ భారత బౌలర్లకు ఏ అవకాశం ఇవ్వలేదు.
Also Read: HCA Scam: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్!
అయితే తొలి సెషన్‌లో 25 ఓవర్లు ఆడి 83 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పయిన ఇంగ్లండ్.. రెండో సెషన్‌లో వేగంగా పరుగులు చేయలేకపోయింది. 2.91 రన్ రేట్‌తో మాత్రమే పరుగులు చేసింది. 2022 తరవాత ఇంత తక్కువ రన్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి. మొత్తానికి బజ్‌బాల్‌పై ఇంగ్లీష్ జట్టు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక టీ విరామ సమయానికి రెండు వికెట్స్ కోల్పయి 153 పరుగులు చేసింది. రూట్, పోప్ 210 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇంగ్లండ్ టీమ్ గత కొన్నేళ్లుగా ‘బజ్‌బాల్’ అంటూ టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. బజ్‌బాల్ ఏంటి అంటే.. టెస్టు క్రికెట్‌లో దూకుడు ఆడడం అని ఇంగ్లండ్ మాజీలు, క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈరోజు టీమిండియాతో మొదలైన లార్డ్స్ టెస్ట్‌లో బజ్‌బాల్ కనబడటం లేదు. మ్యాచ్ చాలా ఇంగ్లండ్ బ్యాటింగ్ సాగుతోంది. ముఖ్యంగా రెండో సెషన్‌లో పరుగుల వేగం తగ్గింది. ఎప్పుడూ 4-5 మధ్య ఉండే రన్ రేట్.. 2.91గా ఉంది. దీంతో బజ్‌బాల్ ఎక్కడి అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
