లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. టీమిండియా ఫీల్డర్లు పలు కీలక క్యాచ్‌లు డ్రాప్ చేశారు. ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పలు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మ్యాచ్ మూడో రోజైన ఆదివారం టీ విరామం వరకు ఆరు క్యాచ్‌లను మనోళ్లు వదిలేశారు. ఫీల్డింగ్ పరంగా గత ఐదేళ్లలో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పాలి. ప్రస్తుతం టీమ్ మొత్తం యువ ఆటగాళ్లతో ఉందని, ఇలా క్యాచ్‌లను డ్రాప్ చేయడం ఏంటని అందరూ మండిపడుతున్నారు. దీనిపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. క్యాచ్‌లను ఎవరూ కావాలని డ్రాప్ చేయరని, అంతా జరిగాక ఏడుస్తూ కూర్చోలేము కదా? అని బదులిచ్చాడు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం పడుతుందా?
‘క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయని ఏడుస్తూ కూర్చోలేం కదా. అన్ని వదిలేసి ఆటలో ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టులోకి చాలా మంది కొత్తగా వచ్చారు. కాబట్టి ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కావాలని మాత్రం ఎవరూ క్యాచ్‌లు డ్రాప్ చేయరు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నా బౌలింగ్‌లో క్యాచ్ డ్రాప్ అయినా లైట్ తీసుకుంటా. బాధతో బంతిని తన్నడం లేదా ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా వారిపై మరింతగా ఒత్తిడి పెంచాలనుకోను’ అని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు.
