Site icon NTV Telugu

ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?

Eng Vs Ind

Eng Vs Ind

ENG vs IND: నేడు (జూలై 2) నుండి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. రెండవ టెస్ట్‌కు ముందే భారత్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు కీలక మార్పులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో ఆకాశ్‌ దీప్‌ కు అవకాశం లభించింది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ లను కూడా జట్టులోకి తీసుకున్నారు.

Read Also:Daren Sammy: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు..!

ఎడ్జ్‌బాస్టన్ మైదానం భారత జట్టుకు అనుకూలంగా లేకపోవడం గమనార్హం. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. గత ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ ఏడుసార్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. అయితే, అదే సమయంలో ఇంగ్లాండ్ కూడా ఈ మైదానంలో జరిగిన గత ఐదు టెస్టుల్లో మూడింటిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండవ టెస్ట్ ఉత్కంఠభరితంగా మారింది. జట్టులో వచ్చిన మార్పులు భారత్‌కి విజయాన్నివ్వగలవా? ఎడ్జ్‌బాస్టన్‌లో మొదటి గెలుపు నమోదు చేసుకోగలదా? అన్న ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక నేటి నుండి మొదలైన మ్యాచ్ లో ప్లేయింగ్ XI ఇలా ఉంది.

Read Also:War 2: హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్?

భారతదేశం (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, KL రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

Exit mobile version