Site icon NTV Telugu

ENG vs IND: భారత్ ఓటములకు ప్రధాన కారణం అదే: టీమిండియా కోచ్‌

Team India Test

Team India Test

Team India coach Ryan Ten Doeschate statement: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు హెడింగ్లీ, లార్డ్స్‌ టెస్టుల్లో ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన టీమిండియా అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో వెనకబడి ఉంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జులై 23 నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లో అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయం సాధించకుంటే సిరీస్ కోల్పోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో భారత్ ఓటములకు అసలు కారణం ఏంటో అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డస్కాటే తెలిపాడు. బ్యాటర్లు అద్భుతంగా పరుగులు రాబడుతున్నా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోతుండటం ఓటములకు ప్రధాన కారణం అని చెప్పాడు.

‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ 2-1తో వెనకబడి ఉంది. ఇది అందరికీ ప్రతికూలంగా కనిపించొచ్చు. నిజానికి టీమిండియా ఆటగాళ్లు ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో వెంట వెంటనే వికెట్లు కోల్పోతుండటం పెద్ద సమస్యగా ఉంది. హెడింగ్లీ, లార్డ్స్‌ టెస్టుల్లో భారత్ ఓటమికి ఇదే కారణం. మాంచెస్టర్‌లో కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. సిరీస్ సమం చేస్తామని ధీమాగా ఉన్నాం. మా ఆటగాళ్లపై నమ్మకం ఉంది’ అని అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డస్కాటే పేర్కొన్నాడు.

Also Read: Eye Health Tips: కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ ఆహారాలు తినండి! గ్రద్ద లాంటి చూపు మీ సొంతం

సిరీస్‌లో కరుణ్‌ నాయర్‌ రిథమ్‌, టెంపో బాగుందని టెన్‌ డస్కాటే తెలిపాడు. అయితే అతడు మరిన్ని రన్స్ చేయాల్సిందన్నాడు. అలానే టాప్‌ త్రీ బ్యాటర్ల నుంచి మరిన్ని పరుగులు ఆశిస్తునాం అని డస్కాటే చెప్పాడు. నాలుగో టెస్ట్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. కరుణ్‌ నాయర్‌ స్థానంలో సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో నాయర్‌ 131 ( 0, 20, 31, 26, 40, 14) పరుగులు మాత్రమే చేశాడు.

Exit mobile version