NTV Telugu Site icon

ENG vs AUS: మరోసారి చతికిలపడ్డ ఇంగ్లాండ్.. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా విజయం..

Aus

Aus

ENG vs AUS 2nd ODI: మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు, ఐదు మ్యాచ్‌ల రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 14వ విజయం. లీడ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్‌ మినహా మరే ఇతర ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా పిచ్‌పై ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీల ఖాతాలో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఆడమ్ జంపాకు ఒక వికెట్ దక్కింది. జామీ స్మిత్ 49 పరుగుల ఇన్నింగ్స్‌తో పాటు, బెన్ డకెట్ 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఆదిల్ రషీద్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచి చివరి వరకు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోతూనే ఉంది. దీంతో మ్యాచ్ వారి చేతుల్లోంచి జారిపోయింది.

T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!

ఇక 74 పరుగులతో ముఖ్యమైన ఇన్నింగ్స్‌కు గాను అలెక్స్ కారీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులేక్ ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన వారికి శుభారంభం లభించక, ఒక దశలో 200 పరుగులకు చేరుకోవడానికి కూడా ఇబ్బంది పడింది. అయితే కెప్టెన్ మిచెల్ మార్ష్ (59 బంతుల్లో 60 పరుగులు) మాత్రమే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా హాఫ్ సెంచరీ సాధించాడు. మొదటి వన్డేలో అజేయంగా 154 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా యొక్క ఏడు వికెట్ల విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హెడ్ కేవలం 29 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.