NTV Telugu Site icon

Shock To TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి షాక్.. క్యాసినో కేసులో ఈడీ నోటీసులు

Imgonline

Imgonline

Shock To TRS MLC: ఇటీవల టీఆర్ఎస్ నేతలకు ఈడీ వరుస షాకులిస్తోంది. ఈ క్రమంలో క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను గతంలో నాలుగు రోజులపాటు ఈడీ విచారించింది. రేపు, ఎల్లుండి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

Read Also: G20 Presidency to India: అధికారికంగా భారత్‎కు జీ20 అధ్యక్ష పగ్గాలు.. బాధ్యతలు అందుకున్న మోదీ

క్యాసినో వ్యవహరంలో పలువురు రాజకీయ వేత్తలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే తలసాని ధర్మేంద్రయాదవ్, మహేష్ యాదవ్ లను ఇవాళ ఈడీ విచారించింది. తాజాగా ఎల్.రమణ,దేవేందర్ రెడ్డిలకు కూడానోటీసులు జారీ చేసింది. క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ కుమార్ తో సంబంధాలున్న పలువురిని ఈడీ విచారిస్తుంది. క్యాసినో కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న వారికి చెందిన నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు.