NTV Telugu Site icon

Azharuddin: మనీలాండరింగ్ కేసులో విచారణకు క్రికెటర్ అజారుద్దీన్‌కు సమన్లు!

Azharuddin

Azharuddin

Azharuddin: మనీలాండరింగ్ కేసులో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. 20 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించినది. నేడు హైదరాబాద్‌ లోని ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని అజారుద్దీన్‌ను ఆదేశించింది. ఆయనకి ఇదే తొలి సమన్లు.

Virat-Anushka: ఇది ట్రయిల్ బాల్.. కోహ్లీకే రూల్స్ నేర్పించిన అనుష్క! నవ్వు ఆపుకోవడం కష్టమే

ఇదివరకు అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తన హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన ఈరోజు దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, పందిరి కొనుగోలు కోసం కేటాయించిన రూ.20 కోట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

Hangover Tips: హ్యాంగోవర్ పోవడానికి ఇలా ట్రై చేయండి!

ఇకపోతే, అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 45.04 సగటుతో 6215 పరుగులు, వన్డేల్లో 36.92 సగటుతో 9378 పరుగులు చేశాడు. టెస్టుల్లో 22 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు.. వన్డేల్లో ఏడు సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా అజారుద్దీన్ వన్డేల్లో 12 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ స్కోరు టెస్టులో 199 పరుగులు, వన్డేలో 153 పరుగులు. అజారుద్దీన్ వన్డే ప్రపంచకప్‌ లకు కూడా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.