Site icon NTV Telugu

Andhra Pradesh: ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా

Karikala Valavan

Karikala Valavan

Andhra Pradesh: దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా చేశారు. రిటైరైన తర్వాత సర్వీసులో కొనసాగనిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే కరికాల వలవన్ రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారని వలవన్‌పై అభియోగాలు వచ్చాయి. ధర్మారెడ్డి రిలీవ్, టీటీడీ కొత్త ఈవోగా శ్యామల రావు నియామకానికే వలవన్‌ను చంద్రబాబు సర్కార్ పరిమితం చేసింది. ఇకపై దేవదాయ శాఖలో కరికాల వలవన్ చేతుల మీదుగా పనులు జరపడానికి ప్రభుత్వ పెద్దలు ఇష్టపడనట్లు తెలుస్తోంది.

Read Also: Minister Narayana: 3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం.. మంత్రి నారాయణ కీలక సమీక్ష

Exit mobile version