జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పారు.
Also Read: Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు
జమ్ముకాశ్మీర్ లోని షోపియాన్, కాప్రాన్, అనంత్‌నాగ్ ప్రాంతాల్లో తరచూ ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల ఎరివేత కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. సరిహద్దులో నిత్యం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు, పోలీసులు మట్టుబెడుతున్నాయి. దీంతో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను అంతం చేస్తున్నాయి.