Site icon NTV Telugu

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ఎన్కౌంటర్..

Encounter

Encounter

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ కొనసాగుతుంది. ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం. ఆర్మీ, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం కలిసి ఉగ్రవాదులపై కాల్పుల దాడి చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టాయి. దీంతో.. భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

Read Also: Bhatti Vikramarka: షాద్ నగర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..

మరోవైపు.. నిన్న భద్రతా దళాలు అనంత్‌నాగ్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్‌లుగా గుర్తించారు. ముగ్గురూ హసన్‌పోరా తవేలా నివాసితులుగా గుర్తించారు.

Read Also: Bus Accident: ప్రైవేట్ స్కూల్‌ బస్సు బోల్తా.. విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

ఇదిలా ఉంటే.. హసన్‌పోరా తుల్ఖాన్ రోడ్‌లోని జాయింట్ బ్లాక్‌లో తనిఖీలు చేపడుతుండగా.. ఉగ్రవాద సహచరులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఒక పిస్టల్, ఒక పిస్టల్ మ్యాగజైన్, 8 పిస్టల్ రౌండ్లు, ఒక గ్రెనేడ్.. ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ఉన్నాయి.

Exit mobile version