NTV Telugu Site icon

Cyber Attack : సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్

Cyber Attack

Cyber Attack

రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అయితే.. ప్రస్తుతం సైబర్‌ దాడుల గురించి వింటూనే ఉంటాం. ఓ కంపెనీపై సైబర్‌ దాడులు చేసిన ఆ కంపెనీని సైబర్‌ నేరగాళ్లు చేజిక్కించుకుంటుంటారు. ఆ తరువాత వారికి కావాల్సినంత డబ్బును డిమాండ్‌ చేస్తూ.. కంపెనీ డాటాను రిస్క్‌లో పెడుతుంటారు. అయితే.. ఇక్కడ కంపెనీకి చెందిన ఉద్యోగులే కంపెనీపై సైబర్‌ దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే సైబర్ దాడులకు పాల్పడ్డారు. అయితే.. గత కొనేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులు సైబర్ అటాక్ చేసి డేటా చేజిక్కించుకున్న కేటుగాళ్లు.. ఈ క్రమంలో హాంగర్ టెక్నాలజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

 

ఈ దర్యాప్తులో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్‌దాడులకు పాల్పడుతున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. దీంతో.. కంపెనీకి సంబంధించిన అందాగ్ విజయ్ కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌తో పాటు ఇద్దరు అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాకుండా.. నిందితుల నుంచి రివ్వాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో ఉన్నా మరో నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.