నంద్యాలలో ఘరానా మోసం వెలుగు చూసింది. పి.ఎం.జే. జ్యువలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ లో ఇంటి దొంగల ముఠా చేతివాటం ప్రదర్శించారు. కాజేసిన సొత్త ఖరీదు రూ 16.6 కోట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కంచర్ల రాఘవ కుమార్. ఇంటి దొంగలు ముఠాగా ఏర్పడ్డ వారిలో మేనేజర్ చిద్విలాస్ రెడ్డి, క్యాషియర్ రమేష్ రెడ్డి, స్టాక్ ను రికార్డు చేసే ఉద్యోగి బండారి లహరి కుమార్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం అనుమతితో నగలను ప్రదర్శన కోసం 275 బంగారు, వెండి ఆభారణలను ముఠా తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత షోరూంలో ఇచ్చినట్టు యాజమాన్యంకు తెలిపారు. కానీ, నగలను తమ వద్దనే ముఠా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అనుమానంతో యాజమాన్యం ఆడిట్ నిర్వహించింది.
Also Read:MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల..
ఆడిట్ లో వెలుగులోకి వచ్చిన మరో షాకింగ్ నిజం.. నకిలీ ఇన్వాయిసులపేరుతో 164 ఆభరణాలను అమ్మినట్లు బయటపడింది. ఇంటి దొంగల ముఠా రూ 16.6 కోట్ల విలువైన15 కేజీల బంగారు ఆభరణాలు, రూ 12.5 లక్షల 8.80 కేజిల వెండి ఆభరణాలు, రూ 4లక్షల నగదును మేరకు అక్రమాలకు పాల్పడినట్లు సంస్థ నిర్ధారించింది. సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కంచర్ల రాఘవ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూ టౌన్ సి. ఐ. అస్రాఫ్ భాష. సంస్థ ఫిర్యాదుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అమౌంట్ ను ఎక్కువగా చూపారనే కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
