Site icon NTV Telugu

Aarambham Naga shivani: ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’ నుంచి హీరోయిన్ శివాని నాగరం పాడిన లిరికల్ సాంగ్ రిలీజ్..!

Aram

Aram

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నాడు. “ఆరంభం” సినిమా ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇవాళ ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘అమాయకంగా..’ రిలీజ్ చేశారు. ఈ పాటకు సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని అందించిన శ్రీకాంత్ అల్లపు లిరిక్స్ రాశారు.

Also Read: Petrol Price Reduce: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గింపు.. ఎక్కడంటే?

ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శివాని నాగరం ఈ పాటను తానే పాడటం విశేషం. ‘అమాయకంగా హడావుడేమి లేక..తార చేరుకుందా ఇలా. అయోమయంగా తలాడించులాగ, నేల మారుతుందే ఎలా..కాలానికే కొత్త రంగు పూసే, మాయతార సొంతమేగా, హాయి సంతకాలు చేసేనా..’ అంటూ మంచి లవ్ ఫీల్ తో ఓ మంచి కంపోజిషన్ తో సాగుతుందీ ఈ పాట. నిజానికి ఈ పాటకు మాత్రం శివాని నాగరం వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందిని చెప్పొచ్చు.

Also Read: Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

ఇక ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉండగా.. అతి త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Exit mobile version