Emmanuel Love: 2025 ఏడాదిలో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కనిపించింది. ఇప్పటికే పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు తమ ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్, బిగ్‌బాస్ సీజన్ 9 కన్సిస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తన జీవితంలోని కొత్త చాప్టర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. చాలా కాలంగా సస్పెన్స్‌గా ఉన్న తన ప్రేమ కథను రివీల్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు.
Google Notebook : గూగుల్ నోట్‌బుక్‌లో సరికొత్త ‘లెక్చర్ మోడ్’..
‘జబర్దస్త్’లో వర్షతో కెమిస్ట్రీ, తనదైన పంచ్‌లతో స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు ఇమ్మాన్యుయేల్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ అలరించాడు. ఏకంగా 9 వారాల పాటు నామినేషన్స్ లోకి రాకుండా రికార్డు సృష్టించిన ఇమ్మూ.. టైటిల్ గెలుస్తాడని అందరూ భావించారు. కానీ చివరకు మూడో రన్నరప్‌గా నిలిచాడు. దాదాపు 15 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గాను ఇమ్మాన్యుయేల్ 40 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
అయితే జబర్దస్త్‌లో ఉన్నప్పుడు వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, అదంతా కేవలం స్కిట్స్ వరకేనని ఇమ్మూ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. తనకు నిజ జీవితంలో వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టారు. “ప్రేమలో ఉన్న మాట నిజమే. ఆ అమ్మాయి ప్రస్తుతం మెడిసిన్ (Medicine) చదువుతోంది. ఆమె ప్రైవసీ దృష్ట్యా వివరాలు గోప్యంగా ఉంచాం” అని తెలిపారు.
9000mAh బ్యాటరీ, Snapdragon 7s Gen 4 చిప్‌తో OnePlus Turbo V ఫోన్ స్పెక్స్ లీక్..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానని చెప్పిన ఇమ్మాన్యుయేల్, అన్నట్లుగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. తాజాగా తన ప్రియురాలి చేతిని పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ముఖం చూపించనప్పటికీ.. “త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను” అనే సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు, అభిమానులు ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన కామెడీతో అందరినీ నవ్వించే ఇమ్మూ, త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు.
