NTV Telugu Site icon

Kangana Ranaut: నటిగా ఉండడం ఇష్టం లేదు: కంగనా

Kangana Ranaut Emergency

Kangana Ranaut Emergency

Kangana Ranaut I Love Direction: నటిగానే కొనసాగడం తనకు నచ్చదు అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ చెప్పారు. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో తానూ ఒకరినన్నారు. దర్శకురాలిగా ఉండటం ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ సమయంలో ఆఫర్స్‌ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అని కంగనా తెలిపారు. కంగనా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్‌ 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌ గురించి చెప్పారు.

‘నటిని కావాలనే ఆశతో 2004లో ముంబైకి వచ్చా. ఆరంభంలో గ్యాంగ్‌స్టర్‌, వోహ లమ్హే వంటి చిత్రాల్లో నటించాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్‌ మోడల్‌, గ్యాంగ్‌స్టర్‌ వంటి ఎన్నో పాత్రలు చేశాను. నా నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అయితే దాదాపు దశాబ్దకాలం పాటు నాకు అవకాశాలు రాలేదు. ఆఫర్స్‌ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నా’ అని కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కంగనా రనౌత్‌ చెప్పారు.

Also Read: Mathu Vadalara 2 Teaser: వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌.. ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ టీజర్‌!

నటిగా కంటే దర్శకురాలిగానే తనకు వర్క్‌ చేయడం బాగుంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కంగనా సమాధానం ఇచ్చారు. ‘నటిగా వర్క్‌ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. నటిగానే కొనసాగడం నాకు నచ్చదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఓ నటిగా చెప్పాలంటే.. సెట్‌కు సంబంధించి పూర్తి సమాచారం మన వద్ద ఉండదు. దర్శకురాలిగా ఉండటం ఇష్టం. సెట్‌లో ఏం జరుగుతుంది? అన్నది నేను చెప్పగలను. నాకు పూర్తి అవగాహన ఉంటుంది. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో నేనూ ఒకరిని అనుకుంటున్నా. సెట్స్‌లో నాకు నటీనటులంటే చాలా గౌరవం. వారిని ఏంతో జాగ్రత్తగా చూసుకుంటా’ అని బాలీవుడ్ క్వీన్ చెప్పుకొచ్చారు.

 

Show comments