Site icon NTV Telugu

Eme Subbamma Idiye Eme Katha: ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’ సినిమా ప్రారంభం.

Movie

Movie

Eme Subbamma Idiye Eme Katha: ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో నిర్మాత మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘”ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ”. ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది .ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిరణ్, ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి, హీరో శ్యామ్ షెల్వన్, హీరోయిన్స్‌ హాన్విక, రితిక, గ్రీష్మ, హీరోయిన్ ఎస్తేర్, జీఎల్‌ ఫనీకాంత్, తదితరులు పాల్గొన్నారు. డీవోపీ గాజుల శివ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, భాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మోహన్ కృష్ణ, లిరికల్ రైటర్ రాము కుంభగిరిలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎల్ ఫణికాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Also: Ganapathi Bappa Morya: ‘గణపతి బప్పా మోరియా’ లోని ‘బప్పా’, ‘మోరియా’ అనే పదాల అర్థం ఏంటో తెలుసా..?

ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. “నేను కొత్త వాడినైనా మా నిర్మాత మల్లికార్జున్ రెడ్డి ఈ కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది . ఈ చిత్రం కచ్చితంగా యూత్‌తో పాటు మొత్తం కుటుంబ సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాము.”అని అన్నారు చిత్ర నిర్మాత మంద మల్లికార్జున్‌ రెడ్డి మాట్లాడుతూ..”ఈ చిత్రం కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నాం” అని అన్నారు.

Exit mobile version