Site icon NTV Telugu

Shocking : మహారాష్ట్రలో దారుణం.. నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు

Child Death1

Child Death1

Shocking : మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్కు పచ్చలారని చిన్నారులు నదిలో శవాలై కనిపించారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో భారీగా శిశువుల మృతదేహాలు కనిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులను గుర్తు తెలియని వారు నదిలో వేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలో విస్మయానికి గురి చేస్తోంది. తమ్‌గావ్ పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపట్టగా వారికి నమ్మలేనటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ స్థానికంగా వ్యాప్తి చెందగానే నది వద్దకు భారీగా గ్రామస్థులు చేరుకున్నారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.

Read Also: Shivani Rajashekar: ఆ విషయంతో పోలిస్తే నాది చిన్నదే అంటున్న శివాని రాజశేఖర్

ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా చేసి మరణించిన శిశువులను నదిలో పడేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తమ్‌గావ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమ అబార్షన్ రాకెట్ సాగుతున్నట్లు పోలీసులు అంగీకరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బుల్దానాలోని సంగ్రామ్‌పూర్ తాలూకా కోలాడ్ లోని వాన్ నదిలో చాలా మృతదేహాలు కనిపించాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉండవచ్చు. ఈ ఘటన గ్రామం మొత్తం భయాందోళనకు గురి చేసింది. దీంతో గ్రామస్థులు సమీపంలోని తమ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో తమ్‌గావ్ పోలీసులు ఈ ప్రాంతంలో అబార్షన్ రాకెట్ చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. త్వరలో వాటిని కఠినతరం చేస్తామని గ్రామస్థులకు నచ్చ జెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

Exit mobile version