Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనుండడంతో.. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి.. అధికార పార్టీ వైసీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది.. వైనాట్ 175 అంటూ ప్రచారానికి సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసిన వైసీపీ.. మరికొన్ని స్థానాలపై కసర్తు చేస్తోంది.. ఇక ఇప్పుడు వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, ఈ నెల 30వ తేదీన తలపెట్టిన సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ..
Read Also: Vivek Venkataswamy: కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు
ఏలూరులో 30న జరగాల్సిన వైసీపీ సిద్ధం సభ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడినట్టు వెల్లడించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. 1వ తేదీన ఏలూరులో సభ నిర్వహిస్తాం.. సిద్ధం సభ ద్వారా ప్రజలకు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా పేర్కొన్నారు.. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేది ఈ సభ నుంచి దిశా నిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. ఇక, టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. తన తల్లిని తిట్టి తనని వీధిలోకి లాగిన వాళ్ల చంక పవన్ కల్యాణ్ ఎక్కారని దుయ్యబట్టారు.. అమావాస్య రోజున పుట్టిన పొత్తు ఏరకంగా ఉంటుందో ముందే ఊహించామన్న ఆయన.. జైల్లో దొంగలు దొంగలు పంచుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీట్లు పంచుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. తెలంగాణ బిడ్డను అని చెప్పిన వైఎస్ షర్మిల.. ఆమెను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి ఇక్కడికి వచ్చారని ఫైర్ అయ్యారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కాగా, ఏలూరులో నిర్వహించనున్న బహిరంగ సభకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మందిని తరలించేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది..