Eluru: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడిని ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండవల్లి మండలం కారు కొల్లు గ్రామానికి చెందిన సాయిచంద్ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో తాను ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు. సాయి దుర్గ ప్రస్తుతం ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమెన్‌గా విధులు నిర్వహిస్తోంది. తమ ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు సాయిచంద్ పేర్కొన్నాడు.
READ MORE: Hyderabad Liquor Sales: ఆల్‌టైం రికార్డ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు..
ఈ వివాహానికి సంబంధించిన విషయాన్ని సాయిచంద్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రమణక్కపేటకు చేరుకున్నారు. అక్కడ సాయిచంద్‌ను చూసిన వారు ఆవేశంతో అతడిని ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో సాయిచంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం యువతి తల్లిదండ్రులు సాయి దుర్గను బలవంతంగా కారులో తీసుకువెళ్లారు. వారి నుంచి బయటపడ్డ బాధితుడు సాయిచంద్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముసునూరు ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Hyderabad Liquor Sales: ఆల్‌టైం రికార్డ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు..
