Andhra Pradesh: కాలం మారింది.. పిల్లలను చదివించాలి.. వాళ్ల కాలపై వాళ్లు నిలబడాలి అని ఆలోచించేవారి సంఖ్య పెరుగుతుంది.. కానీ, అక్కడక్కడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.. చిన్న వయస్సులోనే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేవారు కొందరైతే.. ఇక చదివింది చాలు.. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతంగా చిన్న వయస్సులోనే చిన్నారులకు పెళ్లిళ్లు చేస్తున్నారు.. అయితే, చదువుపై మమకారం ఉన్న ఓ బాలిక.. ఎలాగైనా తన పెళ్లి ఆపాలనుకుంది.. మరింత చదువుకోవాలని అనుకుంది.. సోషల్ మీడియా వేదికగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.. దీంతో.. తన పెళ్లి ఆగిపోవడమే కాదు.. ఆ బాలిక చదువుకోవడానికి చర్యలు చేపట్టారు అధికారులు.
Read Also: Jyotiraditya Scindia: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా..? రాహుల్‌పై విమర్శనాస్త్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన వివాహాన్ని అడ్డుకుని, చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది ఓ బాలిక.. ఫేస్‌బుక్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు పంపించింది ఏలూరు చెంచుల కాలనీకి చెందిన బాలిక.. దీంతో.. వెంటనే స్పందించి, బాలిక చదువుకునేందుకు చర్యలు చేపట్టారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్.. తల్లిదండ్రులు లేని ఆ బాలికకు వివాహాం చేసేందుకు నిశ్చియించిన నానమ్మతాతయ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు.. ఆ చిన్నారికి కావాల్సిన పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, స్కూల్‌కి వెళ్లడానికి ఓ సైకిల్‌ను కూడా అధికారులు సమకూర్చినట్టు తెలుస్తోంది. అమ్మానాన్న లేని ఆ చిన్నారికి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని నానమ్మతాతయ్య ప్రయత్నం చేశారు.. కానీ, ఆ చిన్నారి జీవితం ప్రమాదంలో పడుతుంది గ్రహించలేకపోయారు.