Site icon NTV Telugu

Elon Musk: ట్విట్టర్‌ చీఫ్‌ మాస్టర్‌ ప్లాన్‌.. వారికి డబ్బులే డబ్బులు..!

Elon Musk

Elon Musk

Elon Musk: వ్యాపారం ఎలా చేయాలంటే ట్విట్టర్‌ చీప్‌ ఎలాన్‌ మస్క్‌ను చూసి నేర్చుకోవాలి.. ఇప్పుడు ఆయన సంపాదించుకోవడమే కాదు.. తనను నమ్ముకున్నవారు కూడా నాలుగు రాళ్లు వెనుకేసుకునే స్కెచ్‌ వేశారు.. ఇప్పటికే పలు కీలక నిర్ణయాతో ట్విట్టర్‌లో సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన.. ఇప్పుడు వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపుల ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు ట్విట్టర్‌ చీఫ్‌.

ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్‌ యజమాని అయిన మస్క్ శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా ఈ రాబోయే ఫీచర్‌ను ప్రకటించారు, దీనితో పాటుగా దాదాపు 5 మిలియన్‌ డాలర్లు అంటే రూ.41.2 కోట్లు ప్రారంభ చెల్లింపు బ్లాక్‌ను వెల్లడించారు. మస్క్ తన ట్వీట్‌లో, వెరిఫైడ్ ఖాతాదారులై కంటెంట్‌ క్రియేటర్స్‌ మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు మరియు ధృవీకరించబడిన వినియోగదారులకు అందించబడిన ప్రకటనలు ఖాతాలోకి వస్తాయని పేర్కొన్నాడు. ప్రకటనకర్తలను నిలుపుకోవడంలో ట్విట్టర్ సవాళ్లను ఎదుర్కొంటోంది, ప్రత్యేకించి కంపెనీ యొక్క గణనీయమైన ఉద్యోగుల తొలగింపుల తర్వాత ప్రకటన నియామకం గురించి ఆందోళనల కారణంగా ఈ చర్య వచ్చిందంటున్నారు విశ్లేషకులు.. మస్క్‌ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్‌ మాదిరిగా ట్వీపుల్‌ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌ ప్రకారం డబ్బులు సంపాదించే వెసులుబాటు ఉంటుంది.

ఎలాన్‌ మస్క్‌ గత అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి ఆ సంస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారు.. సీఈవో సహా టాప్‌ క్యాడర్‌ను కొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఆయన.. అనూహ్యంగా వెరిఫైడ్ ఖాతాలకు డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టారు.. అయితే,ప్రకటనదారుల నుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ఈ సోషల్‌ మీడియా దిగ్గజం.. మరోవైపు ట్విటర్‌ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు..

Exit mobile version