NTV Telugu Site icon

Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్

Elon Musk

Elon Musk

Elon Musk: ట్విట్లర్‎ను కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకే ఒక మంత్రం జపిస్తున్నారు. అదే తొలగింపు మంత్రం. ఇప్పటివరకు తన సంస్థలో పని చేసే ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్న మస్క్ తాజాగా తన ఒంట్లో కొవ్వును కూడా తొలగించేశారు. ఇప్పటి వరకు విమర్శల పాలైన మస్క్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. గతంలో లావుగా కనిపించిన మస్క్ రీసెంట్ పిక్స్లో మాత్రం స్లిమ్ ఎండ్ ఫిట్ గా కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు హీరో మాదిరి ఉన్నారంటూ పొగిడేస్తున్నారు.

Read Also: Nitin Gadkari: నితిన్ గడ్కరీకి అస్వస్థత.. స్టేజ్ పై ఉండగానే కుప్పకూలిన కేంద్రమంత్రి

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ ‘ఇప్పుడే చాలా ఫిట్ గా కన్పిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. జవాబుగా 13 కిలోల బరువు తగ్గానని మస్క్ ట్వీట్ చేశారు. బరువు ఎలా తగ్గారంటూ మరో యూజర్ ప్రశ్నించగా.. ఆహారపు అలవాట్లను మార్చుకుని నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా అంటూ మస్క్ సమాధానమిచ్చారు. ‘ఆహారాన్ని మితంగా తీసుకున్నా. నాకు చాలా ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లలేదు. వీటితో పాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నా. ఇవన్నీ క్రమపద్ధతిలో పాటించడం ద్వారా బరువు తగ్గా. బరువు తగ్గాక మరింత చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటున్నా’ అని వివరించారు. మస్క్ బరువు తగ్గడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.