Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ట్విట్లర్ను కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకే ఒక మంత్రం జపిస్తున్నారు. అదే తొలగింపు మంత్రం. ఇప్పటివరకు తన సంస్థలో పని చేసే ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్న మస్క్ తాజాగా తన ఒంట్లో కొవ్వును కూడా తొలగించేశారు. ఇప్పటి వరకు విమర్శల పాలైన మస్క్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. గతంలో లావుగా కనిపించిన మస్క్ రీసెంట్ పిక్స్లో మాత్రం స్లిమ్ ఎండ్ ఫిట్ గా కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు హీరో మాదిరి ఉన్నారంటూ పొగిడేస్తున్నారు.
Read Also: Nitin Gadkari: నితిన్ గడ్కరీకి అస్వస్థత.. స్టేజ్ పై ఉండగానే కుప్పకూలిన కేంద్రమంత్రి
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ ‘ఇప్పుడే చాలా ఫిట్ గా కన్పిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. జవాబుగా 13 కిలోల బరువు తగ్గానని మస్క్ ట్వీట్ చేశారు. బరువు ఎలా తగ్గారంటూ మరో యూజర్ ప్రశ్నించగా.. ఆహారపు అలవాట్లను మార్చుకుని నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా అంటూ మస్క్ సమాధానమిచ్చారు. ‘ఆహారాన్ని మితంగా తీసుకున్నా. నాకు చాలా ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లలేదు. వీటితో పాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నా. ఇవన్నీ క్రమపద్ధతిలో పాటించడం ద్వారా బరువు తగ్గా. బరువు తగ్గాక మరింత చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటున్నా’ అని వివరించారు. మస్క్ బరువు తగ్గడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
You’ve lost a ton of weight, Elon! Keep up the fantastic work! 💯💗 pic.twitter.com/uJhdxWUWqB
— ✨Chicago✨ (@chicago_glenn) November 16, 2022
- Tags
- Musk
- tasty food
- weight loss
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!