Ellyse Perry: సెంచరీతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ.. చరిత్రలో అరుదైన ఘనత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ellyse Perry: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) 2025 లో భాగంగా డిసెంబర్ 7న నార్త్ సిడ్నీ ఓవల్ వేదికగా జరిగిన 40వ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అదరగొట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఆడిన ఈ మ్యాచ్‌లో పెర్రీ 71 బంతుల్లో 111 పరుగుల సెంచరీని సాధించింది. ఈ నేపథ్యంలో WBBL చరిత్రలో 5000 పరుగుల మార్క్ అందుకున్న రెండో మహిళగా రికార్డ్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఘనతను అందుకున్న మొదటి మహిళా బ్యాటర్ బెత్ మూనీ. ఆమె ఇప్పటివరకు 5446 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌తో పెర్రీ తన పరుగుల సంఖ్యను 5072కు చేర్చుకుని ఈ జాబితాలో రెండో స్థానానికి చేరింది.
Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్‌ను ఎలీస్ పెర్రీ శతకంతో శుభారంభం చేసింది. ఆమెతో పాటు సోఫియా డంక్లీ 54 పరుగులు చేయడంతో జట్టు 173 పరుగుల భారీ స్కోరు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఎలీనర్ లారోసా నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి సిక్సర్స్‌కు కాస్త ఇబ్బంది కలిగించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ మంచి ఆరంభం చేసినా ఒక్క పరుగుతో ఓడింది. ఓపెనర్లు టామీ బూమాంట్ (23), మాడెలిన్ పెన్నా (31) రాణించగా.. బ్రిడ్జెట్ ప్యాటర్సన్ 35 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా పోరాడింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠకు చేరుకోగా.. సిడ్నీ సిక్సర్స్ ఒక్క పరుగుతో గెలుపును కాపాడుకుంది. సిక్సర్స్ బౌలింగ్‌లో లారెన్ చీట్లే, అశ్లీ గార్డ్నర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కెర్, కావీమ్ బ్రే ఒక్కో వికెట్ తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
Asaduddin Owaisi: హనుమంతుడికి అసదుద్దీన్ ఒవైసీ హారతి వీడియో వైరల్.. కానీ..
There it is!
A third Big Bash century for the one & only, Ellyse Perry 🙌 #WBBL11 pic.twitter.com/tlniYRZsce
— Weber Women's Big Bash League (@WBBL) December 7, 2025
తాజావార్తలు
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
-
NBK 111 : బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!