NTV Telugu Site icon

Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!

Ellyse Perry

Ellyse Perry

Ellyse Perry Stuns Fans in Mint Green Dress at Cricket Australia Awards 2024: ఎల్లీస్ పెర్రీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ పెర్రీ తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్నారు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పెర్రీకి సోషల్ మీడియాలోనూ యమ క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.3 మిలియన్స్ ఫాలోవర్స్ పెర్రీ సొంతం. ఆమె పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

ఇక ప్రైవేట్ ఫంక్షన్స్‌కు వెళ్తే హాట్ హాట్ డ్రెస్‌లతో ఎల్లీస్ పెర్రీ కుర్రకారు మతులు పోగొడుతుంటారు. మెల్‌బోర్న్‌లోని క్రౌన్ పల్లాడియంలో బుధవారం (జనవరి 31) జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ ఫంక్షన్స్‌లో పెర్రీ తళుక్కున మెరిశారు. గ్రీన్ కలర్ లాంగ్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. 2024 క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షగా నిలిచారు. పెర్రీ హాట్ అందాలకు క్రికెట్ అభిమానులు మంత్రముగ్దులయ్యారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు’ అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Mayank Agarwal: నేను బాగానే ఉన్నా.. పునరాగమనానికి సిద్ధమవుతున్నా: మయాంక్‌ అగర్వాల్‌

33 ఏళ్ల ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యురాలు. 2007 నుంచి ఆసీస్ తరఫున ఆడుతున్న పెర్రీ.. ఇప్పటివరకు 12 టెస్టులు, 141 వన్డేలు, 151 టీ20 మ్యాచులు ఆడారు. టెస్టులలో 925, వన్డేలలో 3852, టీ20లలో 1841 రన్స్ చేశారు. అంతేకాదు బౌలింగ్‌లో 38, 162, 125 వికెట్లు కూడా తీశారు. 2007 నుంచి ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యురాలిగా పెర్రీ వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ.. మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నారు. 2024 క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్‌లో మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను పెర్రీ గెలుచుకున్నారు.