Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ellyse Perry Stuns Fans in Mint Green Dress at Cricket Australia Awards 2024: ఎల్లీస్ పెర్రీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ పెర్రీ తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్నారు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పెర్రీకి సోషల్ మీడియాలోనూ యమ క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.3 మిలియన్స్ ఫాలోవర్స్ పెర్రీ సొంతం. ఆమె పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
ఇక ప్రైవేట్ ఫంక్షన్స్‌కు వెళ్తే హాట్ హాట్ డ్రెస్‌లతో ఎల్లీస్ పెర్రీ కుర్రకారు మతులు పోగొడుతుంటారు. మెల్‌బోర్న్‌లోని క్రౌన్ పల్లాడియంలో బుధవారం (జనవరి 31) జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ ఫంక్షన్స్‌లో పెర్రీ తళుక్కున మెరిశారు. గ్రీన్ కలర్ లాంగ్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. 2024 క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షగా నిలిచారు. పెర్రీ హాట్ అందాలకు క్రికెట్ అభిమానులు మంత్రముగ్దులయ్యారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు’ అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
Also Read: Mayank Agarwal: నేను బాగానే ఉన్నా.. పునరాగమనానికి సిద్ధమవుతున్నా: మయాంక్ అగర్వాల్
33 ఏళ్ల ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యురాలు. 2007 నుంచి ఆసీస్ తరఫున ఆడుతున్న పెర్రీ.. ఇప్పటివరకు 12 టెస్టులు, 141 వన్డేలు, 151 టీ20 మ్యాచులు ఆడారు. టెస్టులలో 925, వన్డేలలో 3852, టీ20లలో 1841 రన్స్ చేశారు. అంతేకాదు బౌలింగ్‌లో 38, 162, 125 వికెట్లు కూడా తీశారు. 2007 నుంచి ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యురాలిగా పెర్రీ వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ.. మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నారు. 2024 క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్‌లో మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను పెర్రీ గెలుచుకున్నారు.
Ellyse Perry won the Australian Women’s ODI & T20I Player of the Year award. 🐐 pic.twitter.com/QqsFMzUoI6
— Johns. (@CricCrazyJohns) January 31, 2024
Ellyse Perry at the blue carpet of Annual Australian Cricket Awards#EllysePerry pic.twitter.com/CsEIDun1x4
— Best Of Actresses (@Whenat_) January 31, 2024
Why she is so beautiful.? 😋✨🥀💞#EllysePerry pic.twitter.com/ZaSNIv0ocv
— Filmi Rethink 🎬 (@FilmiRethink) January 31, 2024
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!