Site icon NTV Telugu

Elevator Accident : ఖమ్మంలో దారుణం.. లిఫ్ట్‌ రాకముందే డోర్‌ ఓపెన్‌ చేయడంతో..

Lift Accident

Lift Accident

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని తెలంగాణ ఆసుపత్రిలో లిఫ్ట్ లో పడి మహిళకు  తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వైరా మండలం గొల్లెనపహాడ్ కు చెందిన ప్రమీల తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువుల ను పరామర్శించేందుకు వచ్చింది. అయితే.. ఆసుపత్రికి వచ్చి ప్రమీల బంధువులను పరామర్శించి తిరిగి వెళ్తుతూ లిఫ్ట్‌ వద్దకు చేరుకుంది. అయితే.. లిఫ్ట్‌ వచ్చిందేమో అనుకున్న ప్రమీల లిఫ్ట్‌ డోర్‌ ఓపెన్‌ చేసి లోపలికి వెళ్లడంతో.. అక్కడ ఖాళీగా ఉండటంతో ఒక్కసారిగి కిందపడి తీవ్ర గాయాలపాలైంది.

 

అయితే.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రమీల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామూలుగా లిఫ్ట్‌ రాకుండా లిఫ్ట్ డోర్‌ తెరుచుకోదు. అయితే.. ఆసుపత్రిలో లిఫ్ట్‌ రాకుండానే లిఫ్ట్ డోర్‌ చేరుకోవడంతో.. ప్రమీల లోపలి వెళ్లింది.. ప్రమీల లిఫ్ట్‌లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Exit mobile version