NTV Telugu Site icon

Elephant Death: పండు అనుకుని నాటుబాంబు కొరికిన గజరాజు.. నొప్పి భరించలేక..

Elephant

Elephant

Elephant Death: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటుబాంబు పేలి మృతి చెందిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. పండు అనుకుని ఆ ఏనుగు నాటుబాంబును కొరికింది. ఏనుగు కొరికిన వెంటనే ఆ బాంబు నోటిలోనే పేలింది. తీవ్రమైన రక్తం స్రావంతో రోడ్డుమీద సహాయం కోసం పెద్ద ఎత్తున ఆరుస్తూ ఆర్తనాదాలు చేసింది. కోయంబత్తూరు ఊటి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాటుబాంబు నోటిలో పేలడంతో ఏమీ తినలేక ఆకలితో ఆ ఏనుగు ప్రాణాలు విడిచింది.

అడవి పందులు తమ పొలాల్లోకి రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే నాటుబాంబును ఇక్కడి స్థానికులు పండ్లు , కూరగాయాలలో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు అది పేలి.. జంతువు నోటికి గాయాలవుతాయి. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్‌లోని ఇటుక బట్టీ సమీపంలో ఏనుగు సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అడవి పందుల కోసం వేటగాళ్లు పండుతో కలిపి కట్టినా నాటు బాంబు తినడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది. గజరాజు ఆ ప్రాంతంలో తిరిగిన వీడియోలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తొండం నుంచి రక్తం కారుతుండడంతో ఆ గజరాజు రోడ్డు మీద సాయం కోసం తిరుగుతూనే ఉంది.

Also Read: King Cobra: ఇంట్లోకి కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్.. వీడియో ఇదిగో!

సమాచారం అందుకున్న అధికారులు, పశువైద్య బృందం ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు ఇంట్రావీనస్ మందులు, గ్లూకోజ్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత అవుట్టుకై’ అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏనుగు ఈ బాంబును ఎక్కడ కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. చివరకు నొప్పి భరించలేక ఏనుగు మృతి చెందింది.