Site icon NTV Telugu

Viral Video: నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్.. నిమిషాల్లోనే లాగేసిన ఏనుగు.. వీడియో వైరల్

Toyota Fortuner

Toyota Fortuner

వర్షాలు కురిసినప్పుడు వాహనాలు వరదల్లో చిక్కుకోవడం, బురదలో కూరుకుపోవడం చూస్తుంటాం. భారీ క్రేన్లు, బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాహనాలను బయటకు లాగుతుంటారు. అయితే తాజాగా ఓ ఏనుగు నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్ కారును నిమిషాల్లోనే బయటకు లాగేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కొంతమంది దీనిపై నిజమైన ఏనుగు నకిలీ ఏనుగును లాగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఏనుగు శక్తి ముందు 166 హార్స్‌పవర్ విఫలమైందని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

Also Read:Pawan Kalyan : ఏపీ థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు

టయోటా ఫార్చ్యూనర్ కారు ఓ నదిలో ఇరుక్కుపోయింది. నదిని దాటే క్రమంలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్య పడలేదు. చివరకు ఏనుగు సాయం తీసుకున్నారు. కారు ముందుభాగంలో తాడు కట్టి ఏనుగుకు అందించారు. ఏనుగు ఆ తాడును దంతాలలో బంధించి కారును బయటకు లాగింది. కారు బొమ్మను లాగేసినట్లు లాగింది. నదిలో చిక్కుకున్న SUV ని నిమిషాల్లోనే ఏనుగు ఎంత సులభంగా బయటకు తీస్తుందో వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకున్నట్లు సమాచారం.

Exit mobile version