Current Bill : కేరళ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి మే 31 వరకు నాలుగు నెలల పాటు విద్యుత్ ధరలు పెరగనున్నాయి. ఇంధన సర్‌ఛార్జ్‌గా యూనిట్‌కు తొమ్మిది పైసలు అదనంగా వసూలు చేసేందుకు రెగ్యులేటరీ కమిషన్ కెఎస్‌ఇబికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులపై విధించే అదనపు ఖర్చును (ఇంధన సర్‌ఛార్జ్ అంటారు)… 2022 ఏప్రిల్ నుంచి జూన్ వరకు విద్యుత్ కొనుగోలుకు అయిన ఖర్చు రూ.87 కోట్లు ఈ విధంగా వసూలు చేయాలని కేఎస్‌ఈబీ డిమాండ్ చేసింది.
Read Also: Arikomban : రేషన్ షాపుకు వెళ్లిన ఏనుగు.. బియ్యం లేవన్న కోపంతో ఏంచేసిందంటే
గత రెండేళ్లుగా సర్‌చార్జి దరఖాస్తులపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతేడాది జూన్‌లో సాధారణంగా యూనిట్‌కు 25 పైసలు పెంచారు. అక్టోబర్ నుండి డిసెంబర్ 2021 వరకు 18.10 కోట్లు, 2022 జనవరి నుండి మార్చి వరకు 16.05 కోట్లు… వసూలు చేసుకునేందుకు మునుపటి కాలాల్లో ఇంధన సర్‌చార్జి విధించాలని బోర్డు చేసిన దరఖాస్తులను కమిషన్ తిరస్కరించింది.
Read Also: Kalvakuntla Himanshu : చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తా