NTV Telugu Site icon

Srisailam Project: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన తెలంగాణ జెన్ కో

Srisailam Project

Srisailam Project

Srisailam Project: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో ప్రారంభించింది. ఉదయం ఏపీ జెన్‌కో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగానే తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 12,713 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read Also: CM Chandrababu: రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేత.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

అయితే.. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్‌ ఫ్లో నిల్‌గా ఉంది. ఔట్‌ ఫ్లో 28, 436 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 812.30 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 35.6802 టీఎంసీల నీటి నిల్వ ఉంది.. అయితే, జులై 15వ తేదీ దాటినా.. చెప్పుకో దగిన స్థాయిలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీరు చేరడం లేదు.. దీంతో.. శ్రీశైలం ఎప్పుడు నిండుతుందా.. నాగార్జున సాగర్‌కు నీరు చేరేది ఎప్పుడు.. ఇలా దిగువ ప్రాజెక్టుల్లో నీటి కోసం.. రైతులు ఎదురుచూస్తున్నారు.