NTV Telugu Site icon

Current Bill : గుడ్ న్యూస్ .. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు

New Project (29)

New Project (29)

Current Bill : రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించారు. ఇటీవల, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్‌లు గుడ్‌బై చెప్పాయి. కానీ నెల రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Read Also:Kolkata Doctor Rape : కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌తోపాటు ఫోన్‌పే ద్వారా ప్రస్తుత చెల్లింపులు చేయవచ్చని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు. వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్ లు నిర్ణయం తీసుకున్నాయి.

Read Also:Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్‌..

ఇప్పటి వరకు వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను ఫోన్ పే , Google Pay సహాయంతో సులభంగా చెల్లించేవారు. కొత్త టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌ యాప్, వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు చేయడంపై ప్రజలు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర మళ్లీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల సస్పెన్షన్ కారణంగా సీపీడీసీఎల్‌లో చెల్లింపుల బకాయిలు భారీగా ఉండడంతో ఫోన్ పే ద్వారా కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. రానున్న నాలుగైదు రోజుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా గూగుల్ పేతో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.