NTV Telugu Site icon

Electric Flying Taxi: ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీ.. సింగిల్ చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణం! ఫొటోస్ వైరల్

Electric Flying Taxi

Electric Flying Taxi

Anand Mahindra Shares Electric Flying Taxi Images: మద్రాస్‌కు చెందిన స్టార్టప్ ‘ఇప్లేన్’ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మేలో ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఇప్లేన్ కంపెనీ భారత దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారీ కంపెనీగా అవతరించింది. వచ్చే ఏడాది ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీలకు సంబందించిన ఫొటోస్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేట్ చేస్తున్న ఇప్లేన్ కంపెనీ.. ఈ ఎయిర్ ట్యా్క్సీని రూపొందిస్తోంది. వచ్చే ఏడాదిలోగా ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పలు సంస్థలను ప్రోత్సహిస్తున్న ఐఐటీ మద్రాస్.. యావత్ ప్రపంచంలోనే ముందుంది. ఐఐటీ మద్రాస్ కారణంగా ఉన్నత లక్ష్యాలతో అనేక సంస్థలు ఉనికిలోకి వస్తున్నాయి. వినూత్న ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చే ఇన్నోవేటర్లు ఉన్న దేశంగా భారత్ మారింది. ధైర్యంగా లక్ష్యాల వైపు పయనించాలి. పరిమితులు ఉండకూడదు’ అని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎయిర్ ట్యాక్సీ ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.

Also Read: Chennai Super Kings: చెన్నై ఓడిపోయినా.. ఎంఎస్ ధోనీ బాగా ఆడితే చాలు!

ఎయిర్ ట్యాక్సీ ఫొటోలను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. కొని వివరాలను కూడా తెలిపారు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఒక్క చార్జింగ్‌తో 200 కిలోమీటర్లర్లు వెళుతుంది. ఇందులో ఇద్దరు (200 కిలోల బరువు) మాత్రమే ప్రయాణించొచ్చు. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్. మనిషే దీనిని నడుపుతాడు. హెలికాఫ్టర్‌లా గాల్లోకి ఎగిరి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇందులో 5 బై 5 మీటర్ల వైశాల్యం ఉంటుంది. ఈ ఎయిర్ ట్యాక్సీ అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ట్యాక్సీని అందుబాటు ధరలలోనే మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.