ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక సోమవారం నాడు జరగబోయే నాలుగో దశలో ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తగు ఏర్పాట్లు చేసింది.
Also read: Vote Ink Mark: మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్.. తొమ్మిదేళ్లు గడుస్తున్న చెరగని సిరా గుర్తు..
ఇక నాలుగో దశలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కన్నౌజ్, షాజహాన్‌పూర్, ఖేరీ, దౌరాహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఎటా, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్ జిల్లాల్లో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి.
Also read: ‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..
ఇక ఈ దశలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు, టిఎంసి నేతలు మహువా మోయిత్రా (కృష్ణానగర్, బెంగాల్), శత్రుఘ్న సిన్హా (అసన్సోల్, బెంగాల్), బిజెపి అగ్రనేతలు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), అర్జున్ ముండా (ఖుంటి, జార్ఖండ్) నాలుగో విడతలో పేరుగాంచిన రాజకీయ నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు.