Site icon NTV Telugu

Elections 2024: మోడీ గెలవాలంటూ చూపుడు వేలు కోసుకున్న వ్యక్తి..!

13

13

ఈ ఏడది జరగబోయే లోక సభ ఎన్నికల్లో మరోసారి మోదీ గెలవాలని తన చూపుడు వేలును కోసుకున్నాడు ఓ వ్యక్తి. తన చూపుడువేలు కాళీమాతకు బలిదానం ఇస్తున్నట్లు అరుణ్ అనే వ్యక్తి తెలిపాడు. కర్ణాటకలో నివసించే అరుణ్ వర్నికకు ప్రధాని మోడీ అంటే చాలా అభిమానం. అరుణ్ తన చూపుడువేలని కోసుకొని.. ఆపై రక్తంతో నిండిన చెయ్యితో అతను ‘అమ్మ కాళీ మాత.. మోడీ బాబా అందరికన్నా గొప్పవారు.. నువ్వు ఆయన్ని రక్షించాలి.. మోడీని గెలిపించాలి’ అని రాశాడట.

Also Read: Matchbox: అగ్గిపెట్టె కోసం గొడవ.. యువకుడి దారుణహత్య..

ఇకపోతే మోడీకి ఇదివరకే అరుణ్ తన ఇంట్లో ఒక గుడి కూడా కట్టాడు. అంతేకాదు ఆ గుడిలో ప్రతిరోజు మోడీకి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. అంతలా మోడీ అంటే అరుణ్ కి పిచ్చి ప్రేమ. ఇకపోతే ఈమధ్య కొందరు మోడీపై వారి అభిమానాన్ని కాస్త చిత్ర విచిత్రంగా తెలుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అరుణ్ కూడా ఓ చిత్రమైన పని చేసి వార్తల్లో నిలిచాడు.

Also Read: Chandrababu: పామర్రు ప్రజాగళంలో చంద్రబాబు కొత్త హామీ

మరికొందరైతే.. మోడీపై ఉన్న అభిమానానికి వారి ఇళ్లలో జరిగే పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డులపై మోడీ ఫోటోలను వేసి ప్రచారం సాగిస్తున్నారు. ఇకపోతే ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్న భారతదేశంలో వచ్చే ఎన్నికల్లో మోడీ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతున్నారు. ఇదే జరిగితే మాత్రం భారతదేశానికి మురుసుగా మూడుసార్లు ప్రధాన బాధ్యతలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారు.

Exit mobile version