NTV Telugu Site icon

Elections 2024: ఇదేం ‘చిల్లర’ నామినేషన్‌ రా బాబోయ్.. దెబ్బకు చెమటలు చిందించిన ఎన్నికల అధికారులు..!

15

15

అతి త్వరలో జరగబోయే లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం పెరిగిపోయింది. ఎన్నికల నేపథ్యంలో భాగంగా తాజాగా కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారి అనుచరులు, ఇంటి సభ్యులతో కలిసి పెద్ద కోలాహలంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటె.. మరోవైపు తాజాగా మహారాష్ట్రలో ఓ విచిత్రమైన నామినేషన్ దాఖలు అయింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రూల్స్ ప్రకారం సదరు అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ అధికారులకి చెమటలు పట్టించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి బీజేపీ ప‌రువు న‌ష్టం నోటీసు..

మహారాష్ట్ర రాష్ట్రంలోని బుల్దానా లోక్‌సభ స్థానంకు లోక్‌సభ అభ్యర్థి వికాస్ అఘాడి ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసేందుకు కాస్త వెరైటీగా వచ్చారు. మొత్తం 10 వేల రూపాయలు ఒక్కో రూపాయి కాయిన్‌ తో చిల్లర తీసుకువచ్చాడు. దాంతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చిన ఆ అభ్యర్థి తెచ్చిన రూపాయి నాణేల మూఠతో ఎన్నికల అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాటిని లెక్కించేందుకు ఎన్నికల అధికారులకి చెమటలు చిందించాల్సి వచ్చింది. ఇక ఈ ప్రత్యేకమైన లోక్‌సభ ఎన్నికల నామినేషన్ కు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Also read:Youth Icon For Loksabha Polls: ఒక్కరోజు మీ వంతు వ‌చ్చిన‌ప్పుడు ఓటు వేయండి అంటున్న హీరో..!

2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ నెల 19న మొదటి దశ పోలింగ్​ జరగనుంది. ఆపై దేశంలో 6 వారాల పాటు జరిగే సార్వత్రిక ఎన్నికలు.. ఏప్రిల్ 19న మొదలు కానుండగా, జూన్ 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగనుండగా.., అందుకోసం పది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ​జరగనుంది. మరి ఈ చిల్లర నామినేషన్ సంబంధించిన వీడియో మీరు కూడా చూసేయండి.

Show comments